11 August 2017
ఆమె వల్ల నంద్యాలలో టీడీపీకి మైనస్సేనా?
తండ్రి నియోజకవర్గంలో గెలుపు కోసం కూతురు అష్టకష్టాలు పడుతోంది. టీడీపీని గెలిపించేందుకు 25 మంది ఎమ్మెల్యేలు - మంత్రులు.. ఇలా అందరినీ సీఎం చంద్రబాబు మోహరించేశారు. నంద్యాలలో గెలుపు కోసం మంత్రి భూమా అఖిలప్రియ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆమె అవగాహనా రాహిత్యం అనుభవలేమి ఇప్పుడు వీరందరికీ షాక్ ల మీద షాకులిచ్చేలా చేస్తోంది. అంతేగాక సీనియర్లను పార్టీకి దూరం చేస్తోంది. తొలి నుంచి ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆమెను ముందుంచి సానుభూతి ఓట్లు పొందాలని భావిస్తున్న టీడీపీ నేతలకు.. ఇప్పుడు తత్వం బోధపడుతోందట. ఆమె వల్ల పార్టీకి మైనస్ అని కొందరు ఆందోళన చెందుతున్నారట.
నంద్యాలలో టీడీపీ - వైసీపీ పోరు తీవ్రంగా ఉంది. విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే టీడీపీ తరఫున ఇక్కడ గెలుపొందే బాధ్యత అంతా భూమా అఖిలప్రియపై పెట్టేశారు సీఎం చంద్రబాబు! అందుకే అన్న గెలుపును తన గెలుపుగా భావించి.. ప్రచారంలోకి దూకేశారు. తొలి నుంచి ఆమె వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఇది మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా పార్టీలో చేరుతున్న వారి విషయంలో ఆమె ఏమాత్రం తమను సంప్రదించడం లేదని వీరంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో చేరుతున్నారన్న సంతోషపడుతున్న సమయంలోనే మరోసారి అలకలు కూడా టీడీపీని కలవరపెడుతున్నాయి.
`మా అన్న ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా` అంటూ ప్రకటించిన నాటి నుంచి నంద్యాలలో గెలుపుకోసం కష్టపడుతున్నారు భూమా నాగిరెడ్డి కూతురు - మంత్రి అఖిలప్రియ. ఆమె పార్టీ సీనియర్లతో చర్చించకుండా ఒంటెత్తు పోకడగా వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని సీనియర్లు తెగేసి చెబుతున్నారట. నంద్యాలలో ఒక విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ ను అఖిలప్రియ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం సమక్షంలోనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇంతియాజ్ వ్యతిరేక వర్గం ఇప్పుడు భూమా ఫ్యామిలీకి వ్యతిరే కం గా మారింది. ఇంతియాజ్ ఒక విద్యాసంస్థకు అధిపతి అయితే… మరో విద్యాసంస్థకు అధిపతి రామకృష్ణారెడ్డి అలకబూనారు.
Subscribe to:
Post Comments (Atom)
-
ఒలింపిక్స్ కు ఎంపిక కావటమే అదో గొప్ప అనుభూతిగా భావిస్తారు. అలాంటి చాన్స్ దక్కినోళ్లు ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా పతకాన్ని సాధించాలని అను...
-
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తన చుట్టూ ఉన్న దేశాల్లోకి ఏదో రకంగా చొచ్చుకుపోయే దుర్మార్గ లక్షణం ఉన్న చైనా.. ...
No comments:
Post a Comment