26 July 2017
టెకీలకు డ్రగ్స్..టీ సర్కారు రియాక్షన్ ఇది
హైదరాబాద్ లో రేకెత్తిస్తున్న డ్రగ్స్ వ్యసనం - ఉపయోగించే దందాలో సినీ పరిశ్రమతో పాటుగా సాఫ్ట్ వేర్ నిపుణులు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ఐటీ రంగంలో డ్రగ్స్ ఉపయోగించడంఫై ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. సిట్ విచారణకు బాధ్యత వహిస్తున్న అకున్ సబర్వాల్ ఏ ఏ ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లిస్టు ఇచ్చారని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లు ఇవ్వలేదని వివరించారు. అందుకే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని వివరించారు. కొద్ది మందిని ఇక్కడికి పిలిపించుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని చోట్లకు తానే వెళ్లి మాట్లాడుతున్నానని జయేశ్ రంజన్ తెలిపారు.
రాష్ట్రంలోని కంపెనీలకు ఆయ కంపెనీల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినట్లు జయేశ్ రంజన్ వెల్లడించారు. తప్పు చేసిన వారిఫై చర్యలు తీసుకోవాలని చెప్పామని ఆయన వివరించారు. హైదరాబాద్ లో దాదాపుగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని సుమారు 400 కంపెనీ లు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నవారు 20 మంది కూడా లేరని ఆయన అన్నారు. తాజాగా డ్రగ్స్ ఉదంతం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభం లో పడిందని భావించొద్దని ఆయన కోరారు. ఈ అంశాన్ని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. మొత్తం ఐటీ రంగం డ్రగ్స్ తీసుకుంటుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఐటీ శాఖ కార్యదర్శి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
-
India's cricket captain Mahendra Singh Dhoni and Olympian gold medallist shooter Abhinav Bindra on Tuesday officially became honorary ...

No comments:
Post a Comment