12 August 2016

రియోలో ఈ ఆటలే ఎక్కువయ్యాయట

ఒలింపిక్స్ కు ఎంపిక కావటమే అదో గొప్ప అనుభూతిగా భావిస్తారు. అలాంటి చాన్స్ దక్కినోళ్లు ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా పతకాన్ని సాధించాలని అనుకోవటం మామూలే. కానీ.. రియోలో ముచ్చట కాస్త వేరుగా ఉంది. ఆట మీదనే కాదు అంతకు మించి అన్నట్లుగా ఆటగాళ్ల మధ్య యవ్వారాలు మాజోరుగా సాగుతున్నాయి. పతక వేటలో ఎంత సీరియస్ గా ఉన్నారో.. సయ్యాటల్లోనూ అంతే సీరియస్ గా ఉండటం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. శృంగారం విషయంలో మొహమాటాలు పెద్దగా లేని నగరంగా పేరున్నరియోలో.. సెక్స్ చాలా కామన్. ఇందుకే ఒలింపిక్స్ ముందు 4.5లక్షల కండోమ్ లు ఒలంపిక్ విలేజ్ లో సిద్ధంగా ఉంచారన్న మాట విన్న వెంటనే.. ఆటాడుకోవటానికి వచ్చేవాళ్లకు కండోమ్స్ తో పనేం ఉంటుందని అనుకున్నోళ్లు చాలామందే. అయితే.. అసలు ఆటతో పాటు.. శృంగార ఆట ఖాయమన్న విషయాన్ని నిర్వాహకులు వేసిన అంచనా ఇప్పుడు నిజం కావటమే కాదు.. సయ్యాటల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తూ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారట. 

ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో పరిస్థితులకు తగ్గట్లే క్రీడాకారులు కాస్త ఓపెన్ గానే తమ భావాల్ని ట్విట్టర్లో పంచుకోవటానికి వెనుకాడటం లేదు. అమెరికా ఫుట్ బాల్ క్రీడాకారిణి హోప్ మాటల్నే తీసుకుంటే.. తాను ఒలింపిక్స్ నుంచి మధుర జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెప్పి.. ఆ జ్ఞాపకాలు శృంగారానివి కావొచ్చంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఆమె ఒక్కతే కాదు మరో  క్రీడాకారిణి బెనిన్ ఫెన్సర్ యెమి అపితి కూడా ఇదే తీరులో ట్వీట్ చేసింది. తాను చాలా బాగుంటానని.. అందుకే ఒలింపిక్ గ్రామంలో తనకు చాలానే డేటింగ్ ప్రతిపాదనలు వచ్చినట్లుగా పేర్కొంది. 

ఇలా మగ.. ఆడ అన్న తేడా లేకుండా చాలామంది క్రీడాకారులు సెక్స్ కబుర్లను చాలానే చెప్పేస్తున్నారు. మరో క్రీడాకారుడి మాటల్లో ఒలింపిక్ క్రీడా గ్రామం ఎలా ఉందన్న విషయాన్ని వింటే కాసింత ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం. ఎందుకంటే.. అక్కడ జరుగుతున్న విషయాన్ని కాస్త ఓపెన్గానే చెప్పేశారు. ‘‘ఒలింపిక్స్ జీవితకాల అనుభవం. ఎవరైనా మధుర జ్ఞాపకాలతో వెనుదిరగాలనుకుంటున్నారు. ఆ గురుతులు పార్టీలు లేదా సెక్స్ కు సంబంధించినవి కావొచ్చు. బహిరంగంగా...సెక్స్ చేసుకున్నవాళ్లను  చూశా. అది బయట కావొచ్చు.. భవనాల మధ్య కావొచ్చు.కాస్త అనువైన స్థలం కనిపిస్తే చాలన్నట్లుగా ఉంది. వారికెలాంటి హద్దులూ ఉండవు ’’ అని చెప్పుకొచ్చారు. ఇలా అసలు ఆట విషయం ఏమో కానీ.. శృంగార ఆటలో మాత్రం చాలామంది ప్లేయర్లు చెలరేగిపోతున్నట్లు చెబుతున్నారు. 

No comments:

Post a Comment