తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ల కృష్ణా పుష్కర స్నానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! వందల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాలను ప్రచారం కోసం వాడుకొంటున్నాడు అనే విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్న బాబు కనీసం తలారా మునగకపోవడం సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బాబు కానీ , లోకేష్ కానీ కనీసం సంపూర్ణంగా కృష్ణ నీళ్లలో మునగలేదు లేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
హిందూ సంప్రదాయాలు ఎరిగిన వారు ఎవరికైనా.. నదీ స్నానం అంటే ఏమిటో, మునక వేయడంపై అవగాహన ఉండే ఉంటుంది. శరీరమంతా సంపూర్ణంగా తడిచేలా స్నానం చేయడం మన సంప్రదాయం. అయితే వేద పండితులను పక్కనే పెట్టుకుని స్నానం చేసిన చంద్రబాబులు మొహాన్ని మాత్రం నీళ్లలోకి ముంచి.. పైకి లేచారు. కనీసం ఒక్కసారి కూడా వీళ్లు లోపలకు మునగలేదు. తలను ముంచలేదు! వాళ్లు పుష్కర స్నానం చేసిన వీడియోలను పరిశీలిస్తే అందులోని అసంపూర్ణత ఏమిటో స్పష్టం అవుతుంది!
కృష్ణా నీళ్లలో భయంకరమైన స్థాయిలో బ్యాక్టీరియా ఉంది, ఈకోలీ పుష్కలంగా ఉంది.. అని భయపడ్డారో లేక.. అలా పైపైన స్నానం చేస్తే చాలనుకున్నారో కానీ.. ఇలా సగం సగం వ్యవహారంతో చంద్రబాబు నాయుడు విమర్శకులకు మళ్లీ పని చెప్పాడు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పుష్కర స్నానం సమయంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న తీరు సగటు జనాల్ని కట్టి పడేసింది. సంప్రదాయాలపై తనకు ఎంత గౌరవం ఉందో కేసీఆర్ చాటుకున్నాడు. బాబు, ఆయన తనయుడు మాత్రం మొక్కుబడి స్నానంతో వార్తల్లోకి వచ్చారు!
No comments:
Post a Comment