12 August 2016

బాబూ.. పుష్కర స్నానం చేసేది ఇలాగేనా!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ల కృష్ణా పుష్కర స్నానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! వందల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాలను ప్రచారం కోసం వాడుకొంటున్నాడు అనే విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్న బాబు కనీసం తలారా మునగకపోవడం సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బాబు  కానీ , లోకేష్ కానీ కనీసం సంపూర్ణంగా కృష్ణ నీళ్లలో మునగలేదు లేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
హిందూ సంప్రదాయాలు ఎరిగిన వారు ఎవరికైనా.. నదీ స్నానం అంటే ఏమిటో, మునక వేయడంపై అవగాహన ఉండే ఉంటుంది. శరీరమంతా సంపూర్ణంగా తడిచేలా స్నానం చేయడం  మన సంప్రదాయం. అయితే వేద పండితులను పక్కనే పెట్టుకుని స్నానం చేసిన చంద్రబాబులు మొహాన్ని మాత్రం నీళ్లలోకి ముంచి.. పైకి లేచారు. కనీసం ఒక్కసారి కూడా వీళ్లు లోపలకు మునగలేదు. తలను ముంచలేదు! వాళ్లు పుష్కర స్నానం చేసిన వీడియోలను పరిశీలిస్తే అందులోని అసంపూర్ణత ఏమిటో స్పష్టం అవుతుంది!
కృష్ణా నీళ్లలో భయంకరమైన స్థాయిలో బ్యాక్టీరియా ఉంది, ఈకోలీ పుష్కలంగా ఉంది.. అని భయపడ్డారో లేక.. అలా పైపైన స్నానం చేస్తే చాలనుకున్నారో కానీ.. ఇలా సగం సగం వ్యవహారంతో చంద్రబాబు నాయుడు విమర్శకులకు మళ్లీ పని చెప్పాడు. 
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పుష్కర స్నానం సమయంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న తీరు సగటు జనాల్ని కట్టి పడేసింది. సంప్రదాయాలపై తనకు ఎంత గౌరవం ఉందో కేసీఆర్ చాటుకున్నాడు. బాబు, ఆయన తనయుడు మాత్రం మొక్కుబడి స్నానంతో వార్తల్లోకి వచ్చారు! 

బీజేపీ సీఎం బోణీ చేశారు

వడ్డించే వాడు మనోడైతే ఏ పంక్తిలో కూర్చున్నా భోజనం గ్యారంటీ అంటారు. మోడీ ప్రభుత్వం పట్టుపట్టి ఆమోదింపజేసుకున్న జీఎస్టీ బిల్లు ఇప్పుడు ఇదే సూత్రంపై ఆధారపడి రాష్ట్రాల్లో ఆమోదం పొందడం మొదలుపెట్టింది. అసోంలో ఈ బిల్లుకు ఈ రోజు ఆమోదం పలికారు. ఇంతకాలం కాంగ్రెస్ పాలనలో ఉన్న అసోం మొన్నటి ఎన్నికల తరువాత బీజేపీ పాలనలోకి వచ్చింది. అక్కడ మోడీ సన్నిహితుడు మాజీ కేంద్రమంత్రి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రయ్యారు. దీంతో జీఎస్టీ బిల్లు అక్కడి శాసనసభలో ఆమోదం పొందడం తేలికైంది. 

సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్నా అన్ని అడ్డంకులను తొలగించుకొని రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్ టీ) బిల్లు లోక్ సభలోనూ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈరోజు జీఎస్ టీ బిల్లును అసోం శాసనసభ ఆమోదించి జీఎస్ టీ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే జీఎస్ టీ బిల్లుపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఫలితం అసోంలో మొట్టమొదటగా కనిపించింది.

మూడు నెలల క్రితం బీజేపీ యువ నేత - కేంద్ర మాజీ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సర్బానంద సోనోవాల్ అసోం శాసనసభలో జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. జీఎస్టీ బిల్లుతో అసోం రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరంగా తమ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ పాలనలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఈ బిల్లు ఆమోదానికి తొందరపడనున్నాయి. ఆయా రాష్ర్టాల్లోని శాసనసభలు సమావేశమైతే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. వాటితో పాటు బీజేపీ మిత్రపక్షాల పాలనలోని రాష్ట్రాలూ కూడా అడాప్టు చేసుకోనున్నాయి.

రియోలో ఈ ఆటలే ఎక్కువయ్యాయట

ఒలింపిక్స్ కు ఎంపిక కావటమే అదో గొప్ప అనుభూతిగా భావిస్తారు. అలాంటి చాన్స్ దక్కినోళ్లు ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా పతకాన్ని సాధించాలని అనుకోవటం మామూలే. కానీ.. రియోలో ముచ్చట కాస్త వేరుగా ఉంది. ఆట మీదనే కాదు అంతకు మించి అన్నట్లుగా ఆటగాళ్ల మధ్య యవ్వారాలు మాజోరుగా సాగుతున్నాయి. పతక వేటలో ఎంత సీరియస్ గా ఉన్నారో.. సయ్యాటల్లోనూ అంతే సీరియస్ గా ఉండటం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. శృంగారం విషయంలో మొహమాటాలు పెద్దగా లేని నగరంగా పేరున్నరియోలో.. సెక్స్ చాలా కామన్. ఇందుకే ఒలింపిక్స్ ముందు 4.5లక్షల కండోమ్ లు ఒలంపిక్ విలేజ్ లో సిద్ధంగా ఉంచారన్న మాట విన్న వెంటనే.. ఆటాడుకోవటానికి వచ్చేవాళ్లకు కండోమ్స్ తో పనేం ఉంటుందని అనుకున్నోళ్లు చాలామందే. అయితే.. అసలు ఆటతో పాటు.. శృంగార ఆట ఖాయమన్న విషయాన్ని నిర్వాహకులు వేసిన అంచనా ఇప్పుడు నిజం కావటమే కాదు.. సయ్యాటల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తూ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారట. 

ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో పరిస్థితులకు తగ్గట్లే క్రీడాకారులు కాస్త ఓపెన్ గానే తమ భావాల్ని ట్విట్టర్లో పంచుకోవటానికి వెనుకాడటం లేదు. అమెరికా ఫుట్ బాల్ క్రీడాకారిణి హోప్ మాటల్నే తీసుకుంటే.. తాను ఒలింపిక్స్ నుంచి మధుర జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెప్పి.. ఆ జ్ఞాపకాలు శృంగారానివి కావొచ్చంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఆమె ఒక్కతే కాదు మరో  క్రీడాకారిణి బెనిన్ ఫెన్సర్ యెమి అపితి కూడా ఇదే తీరులో ట్వీట్ చేసింది. తాను చాలా బాగుంటానని.. అందుకే ఒలింపిక్ గ్రామంలో తనకు చాలానే డేటింగ్ ప్రతిపాదనలు వచ్చినట్లుగా పేర్కొంది. 

ఇలా మగ.. ఆడ అన్న తేడా లేకుండా చాలామంది క్రీడాకారులు సెక్స్ కబుర్లను చాలానే చెప్పేస్తున్నారు. మరో క్రీడాకారుడి మాటల్లో ఒలింపిక్ క్రీడా గ్రామం ఎలా ఉందన్న విషయాన్ని వింటే కాసింత ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం. ఎందుకంటే.. అక్కడ జరుగుతున్న విషయాన్ని కాస్త ఓపెన్గానే చెప్పేశారు. ‘‘ఒలింపిక్స్ జీవితకాల అనుభవం. ఎవరైనా మధుర జ్ఞాపకాలతో వెనుదిరగాలనుకుంటున్నారు. ఆ గురుతులు పార్టీలు లేదా సెక్స్ కు సంబంధించినవి కావొచ్చు. బహిరంగంగా...సెక్స్ చేసుకున్నవాళ్లను  చూశా. అది బయట కావొచ్చు.. భవనాల మధ్య కావొచ్చు.కాస్త అనువైన స్థలం కనిపిస్తే చాలన్నట్లుగా ఉంది. వారికెలాంటి హద్దులూ ఉండవు ’’ అని చెప్పుకొచ్చారు. ఇలా అసలు ఆట విషయం ఏమో కానీ.. శృంగార ఆటలో మాత్రం చాలామంది ప్లేయర్లు చెలరేగిపోతున్నట్లు చెబుతున్నారు. 

టీఆర్ ఎస్ లో వారి బాధ వర్ణణాతీతం

తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ నాయకుల్లో గందరగోళం నెలకొంటుంది. కారు జోరు కొనసాగుతున్న సమయంలో అధికార పార్టీలోకి వలసల రూపంలో వచ్చిన నేతల్లో అయోమయం తారాస్థాయికి చేరిందని అంటున్నారు. గతంలో  టీఆర్ ఎస్ లో ఉన్న నాయకులు తమ వారికి న్యాయం చేసుకోలేక ఇబ్బందుల్లో ఉంటే....సార్వత్రిక ఎన్నికల అనంతరం కారెక్కిన నాయకులు తమ అడ్రస్ ఏంటని ప్రశ్నించుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇందులో మెజార్టీ నాయకులు తెలుగుదేశం వారుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిలతో పాటు సీనియర్ నేత పాలమూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పి.రాములు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందిన కె. విజయ రామారావు వంటి నేతలున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వరంగల్ జిల్లాకే చెందిన మాజీమంత్రి బస్వరాజ్ సారయ్య వంటి వారున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలను టీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా పార్టీలో చేర్చుకుంది. ఇందులో ప్రధానంగా టీడీపీ నుంచి మాజీ మంత్రులు కే విజయరామారావు - సీ కృష్ణాయాదవ్ - ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ - మాగంటి గోపినాథ్ - సాయన్న - మాధవరం కృష్ణారావు వంటి వారు ఉన్నారు. వీరందరికి రాజకీయంగా ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం కెసిఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు హమీ ఇచ్చారు. 

కారెక్కి నెలలు దాటిపోతున్న నేపథ్యంలో పార్టీ మారిన పలువురు నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కండువా మార్చుకుంటున్న  సందర్బంలో తమకు అధినేత నుండి స్పష్టమైన హమీ ఉందని కొందరు నేతలు పేర్కొంటుంటే మరికొందరు మాత్రం జిల్లా స్థాయిలోనైనా అవకాశాలు రాకపోతాయా అంటు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో హ్యపీగానే ఉండగా పదవులు లేని సీనియర్ నేతలు మాత్రం తమకెపుడు అవకాశాలు వస్తాయో తెలియక ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో పలు మార్కెట్ - దేవాలయ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలు కార్పోరేషన్ ఛైర్మన్ పదవులతో పాటు ఎమ్మెల్సీ వంటి పదవులను ఆశించి పార్టీలో చేరిన వారు ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నారని చెప్తున్నారు. పార్టీ అగ్ర నేతలు - మంత్రుల అపాయింట్ మెంట్లు కూడా లభించడం లేదని మరికొందరు నేతలు వాపోతున్నారు. తమతోపాటు వచ్చిన కార్యకర్తలకు కనీసం న్యాయం చేయలేకపోతున్నామని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చర్చ సాగుతోంది.టీఆర్ ఎస్ లో వారి బాధ వర్ణణాతీతం

BABU BANGARAM

Babu Bangaram is an upcoming 2016 Telugu action romantic comedy film, produced by S. Naga Vamshi, P. D. V. Prasad on Sitara Entertainments banner and written & directed by Maruthi.[1] Starring VenkateshNayanthara in the lead roles[2][3][4] and music composed by Ghibran.[5]
The film was launched on 16 December 2015 in Hyderabad and principle photography began the following day.[6][7] The first look poster of the film was released on 7 April 2016 on the eve of Ugadi.[8]
Babu Bangaram obtains U/A from censor board.[9] The film is scheduled for a worldwide release on 12 August 2016.[10] The film will be simultaneously be released with a Tamil dubbed version titled Selvi.
Babu Bangaaram
Venkatesh-Maruthi Project.jpg
Film poster
Directed byMaruthi
Produced byS. Naga Vamshi
P. D. V. Prasad
S. Radha Krishna
(Presenter)
Written byDarling Swamy (dialogues)
Screenplay byMaruthi
Story byMaruthi
StarringVenkatesh
Nayanthara
Music byGhibran
CinematographyRichard Prasad
Edited byS.B. Uddav
Production
company
Sitara Entertainments
Distributed byHaarika & Hassine Creations
Release dates
  • 12 August 2016
CountryIndia
LanguageTeluguBABU BANGARAM